జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం
భారతదేశంలో ప్రతి ఏటా ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 1993 ఏప్రిల్ 24న 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన జ్ఞాపకార్థం, స్థానిక స్వపరిపాలనను పటిష్టం చేసేందుకు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని జరుపుతుంది.

