తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా కార్మికులు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని, ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. రేపు (శుక్రవారం) డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు జరపనుంది.

