సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అందకపోవడంతో వారి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులపై మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.రెగ్యులర్ ఉద్యోగులకు రూ.6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు రూ.8 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించింది. అవసరమైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులకు ఇచ్చే జీతాల్లో నుంచి 50 శాతం కోత విధించుకునేందుకు నిర్ణయించింది. 100 రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు దిశగా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.

