ఐఏఎస్ అధికారి, రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకపోవడంపై తీవ్రంగా మండిపడింది. వారి జీవితాలతో ఎలా ఆడుకుంటారని వ్యాఖ్యానించింది. అహ్మద్ బాబుపై పన్ను వసూళ్ల విషయంలోనూ ఆరోపణలున్నాయని పేర్కొంది. తమకే అధికారం ఉంటే వెంటనే అహ్మద్ బాబును సస్పెండ్ చేసే వాళ్లమంది. ఐఏఎస్‌గా కొనసాగేందుకు అహ్మద్ బాబు అర్హతపై విచారణ జరిపిస్తామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

