ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ఆర్‌సిబిని గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని ఆర్‌సిబి భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్‌సిబి పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి వెళ్లే అవకాశం ఉంది.

