దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్ లు కూడా బీజేపీలో చేరారు. ఇటీవల రాఘవ్ చద్దాను ఆప్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. పలు సార్లు ఆయన ఆప్ విధానాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా.. రాజ్య సభలో తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడం సంచలంగా మారింది.

