తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కేంద్రంలో రైతుల ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది. రైతు వేదిక ముందు ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన చేపట్టిన రైతులు ధాన్యం కొనుగోళ్లు చేయకపోతే పురుగుల మందు తాగుతామని చెప్పారు. ధాన్యం క్వాలిటీ పేరుతో గ్లాసుల్లో ధాన్యం తీసుకున్న అగ్రికల్చర్ అధికారిపై తిరగబడ్డ రైతులు అగ్రికల్చర్ అధికారిని,PACS అధికారులను సైతం రైతువేదికలో పెట్టి తలుపులు వేశారు రైతులు. రైతుల గోస పట్టించుకోకపోవడం వల్లే ఈస్థాయిలో తిరగబడాల్సి వచ్చిందని తమ ఆవేదనను మీడియా ముందు వెలిబుచ్చారు.

