బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. “దీదీ పోవడం ఖాయం.. బీజేపీ రావడం తథ్యం” అంటూ ప్రజల్లో ఉత్సాహం నింపేలా నినాదాలు చేశారు. తొలి దశ ఎన్నికల్లో ఓటర్లు ఎన్నడూ లేనివిధంగా భారీ సంఖ్యలో తరలిరావడం చూస్తుంటేనే తృణమూల్ కాంగ్రెస్ శకానికి తెరపడిందని స్పష్టమవుతోందని ఆయన విశ్లేషించారు. మొదటి విడత పోలింగ్ ట్రెండ్స్ చూసిన తర్వాత, తాము కచ్చితంగా 110 స్థానాలకు పైగా గెలుచుకుంటామని ఆయన జోస్యం చెప్పారు.

