జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎర్రటి ఎండలో నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు డిపో లోపల నిరసన తెలిపే విధంగా అనుమతి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలీసులను కోరారు. ఇందుకు పోలీసులు అనుమతించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడపాలని ప్రయత్నిస్తే ఆర్టీసీ కార్మికులతో కలిసి బస్సులను అడ్డుకుంటామని హెచ్చరించారు.

