భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోల్‌కతా పర్యటనలో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 24) ఉదయం హుగ్లీ నది తీరాన ఆహ్లాదకరంగా గడిపారు. బోటులో విహరిస్తూ నదీతీర ప్రకృతి అందాలను ఆస్వాదించిన ఆయన, ఐకానిక్ హౌరా బ్రిడ్జ్ మరియు విద్యాసాగర్ సేతు దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా తీరంలోని మత్స్యకారులతో, మార్నింగ్ వాకర్స్‌తో మోదీ సరదాగా ముచ్చటించారు. ప్రధానిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.

