విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపుల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఎం నాయకులు చేపట్టిన ధర్నా తీవ్ర ఆగ్రహాన్ని ప్రతిబింబించింది. డేటా సెంటర్ కోసం భూములు కోల్పోయిన 520 మంది రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన రాయితీలు, నష్టపరిహారం ఇప్పటికీ పూర్తిగా అందలేదని వారు ఆరోపించారు. ప్రిల్ 28న ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్న నేపథ్యంలో, రైతులకు న్యాయం చేయకుండా శంకుస్థాపనకు వెళ్లడం అన్యాయమని సిపిఎం నేతలు మండిపడ్డారు.

