జూబ్లీహిల్స్ ప్యాలెస్ కిటికీలో నుండి చూస్తే నీకు కనపడే తీగల వంతెన కట్టింది కేసీఆర్ కాదా.. రోజూ మీ ఇంటికి వెళ్లేటప్పుడు కనిపించే టీ హబ్ గాని, స్టీల్ బ్రిడ్జి గాని కేసీఆర్ గారు కట్టింది కాదా.. అని హరీశ్‌రావు అడిగారు. హైదరాబాద్ నగరంపై కేసీఆర్ ముద్రను చెరపడం నీ జేజమ్మతో కూడా కాదు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

