భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఏప్రిల్ 24న కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు ఇచ్చిన బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బ్యాంకు కార్యకలాపాలు డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా సాగినట్లు, అలాగే లైసెన్స్ నిబంధనలను పాటించలేదని RBI వెల్లడించింది. RBI ఉత్తర్వుల ప్రకారం, 2026 ఏప్రిల్ 24 వ్యాపార సమయం ముగిసిన తర్వాత నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై బ్యాంకింగ్ సేవలు అందించడానికి అనుమతి ఉండదు.

