ంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఎస్సీ ఎమ్మెల్యేలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని, కొందరిలో దళితులంటే చులకన భావం ఉందని ఆయన బహిరంగంగానే నిలదీశారు. మరే ఇతర కులాల్లో ఎమ్మెల్యేలు తప్పులు చేయడం లేదా? కేవలం ఎస్సీ ఎమ్మెల్యేలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అని థామస్ ప్రశ్నించారు. నియోజకవర్గంలో టీడీపీలోని ఒక వర్గం ఎమ్మెల్యేకు సహకరించకుండా, సమాంతరంగా పాలన సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

