డిజిటల్ యుగంలో మనం ఫోన్లు, చాట్స్, సోషల్ మీడియాతో మాట్లాడటం అలవాటు చేసుకున్నాం. ఒకప్పుడు మనసులోని భావాలను చెప్పడానికి ఉత్తరమే ఆధారం. ఈ అందమైన సంప్రదాయాన్ని మళ్లీ గుర్తు చేస్తూ భారత తపాలా శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే ఢాయీ అక్కర్ (Dhai Akhar) పోటీ 2025-26 సంవత్సరానికి కూడా ప్రకటించింది. ఈసారి థీమ్ ‘నీ రోల్ మోడల్‌కు ఉత్తరం రాయండి’ (Letter to My Role Model) అని ఉంది. ఉత్తరాలు Superintendent of Post Officesకి పంపాలి.

