సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కేఎస్‌ఆర్ కాలేజీ సమీపంలోని రోడ్డు వద్ద పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు పడేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఒక అధికారిని సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై ఈసీ స్పందించింది. పోలింగ్‌కు ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) పరీక్షించేటప్పుడు మాక్ పోలింగ్ కోసం వినియోగించిన స్లిప్స్ అని తెలిపింది.

