పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ ఎదుట పలువురు ఆందోళనకు దిగారు. వీరిలో శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నేత కోట వినుత డ్రైవర్ రాయుడు అలియాస్ శ్రీనివాస్ కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారూ.. మీరే న్యాయం చేయాలంటూ రాయుడు కుటుంబం తిరుపతి కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు ప్రదర్శించింది. రాయుడు పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అని, చనిపోయి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ.. జనసేన నుంచి స్పందన లేదని.. పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

