దక్షిణ చైనా సముద్రంపై క్వాడ్ తీవ్ర ఆందోళన
సముద్రంలో జరుగుతున్న పరిణామాలు క్వాడ్ దేశాలకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భౌగోళికంగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతాల్లో దక్షిణ చైనా సముద్రం ఒకటి. ఇక్కడ చైనా ఆక్రమణలు చేయడం సహా ఇతర దేశాల నావికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ‘9-డాష్ లైన్’ విధానాన్ని అమలు చేయడం, వివాదాస్పద దీవులను మిలిటరైజ్ చేయడం భారత్, క్వాడ్ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.

