భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ షాక్ ఇచ్చారు. రష్యా తో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్, చైనాలపై 500 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో యూఎస్ సెనేట్‌లో దీనిపై బిల్లు తెచ్చేందుకు రెడీ అవుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తామన్నారు. ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు.

