పంజాబ్ అసెంబ్లీలో శుక్రవారం రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఏకగ్రీవంగా నెగ్గింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సారధ్య ప్రభుత్వం ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆప్ ఎంపీల ఫిరాయింపుల
దశలో ఈ బలపరీక్షకు దిగింది. బలపరీక్ష కోసం పంజాబ్ విధాన సభ ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు. పార్టీలో తామంతా విశ్వసనీయ సైనికుల మాదిరిగా ఉంటామని ఎమ్మెల్యేలు ప్రకటించారు. తమ ప్రభుత్వ బలపరీక్ష తీర్మానాన్ని ముఖ్యమంత్రి మాన్ స్వయంగా సభలో ప్రవేశపెట్టారు.

