సత్యజిత్ రాయ్ (మే 2 1921–ఏప్రిల్ 23 1992) భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన సినీ దర్శకుడు, రచయిత. ఆతను ప్రపంచ సినిమాలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకడుగా పేరు గడించాడు.మొదటి సినిమా పథేర్ పాంచాలీ, కేన్స్ చలనచిత్రోత్సవంలో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. అతనికి దర్శకత్వమే కాక, సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది.1992లో, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఆస్కార్) సత్యజిత్ రాయ్ కి అకాడమీ గౌరవ పురస్కారం (ఆస్కార్ అవార్డు) అందించారు.

