ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఘనాలో పర్యటించారు. మూడు దశాబ్దాల తర్వాత ఘనాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామాని మహామా స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీకి ఘనా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డును ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని మోదీ భారత ప్రజలకు అంకితం చేశారు.

