దలైలామా తన వారసుడి ఎంపికపై కీలక ప్రకటన చేస్తూ, భవిష్యత్ లో తన పునర్జన్మ (రిఇంకార్నేషన్)కు గుర్తింపు ఇచ్చే ఏకైక హక్కు తమ అధికారిక కార్యాలయమైన గదెన్ ఫోడ్రంగ్ ట్రస్ట్‌కే ఉందని స్పష్టంగా చెప్పారు. ఈ ప్రకటనతో చైనాకు నేరుగా సవాల్ విసిరారు. ఎందుకంటే, చైనా ఇప్పటికే దలైలామా వారసత్వం, టిబెటియన్ బౌద్ధమతంపై ప్రభావం చూపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా-టిబెట్ మధ్య మరో కొత్త ఘర్షణకు మెుదలు అవుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

