కెనడా ప్రభుత్వం విదేశీయులకు శాశ్వత నివాసం కల్పించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా నైపుణ్యం కలిగిన శరణార్థులు, ఇతర దేశాల నుంచి వచ్చిన ఆర్థిక వలసదారులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక నిపుణులు, ఫ్రెంచ్ మాట్లాడేవారికి దీని వల్ల అధిక ప్రాధాన్యత లభిస్తుంది. తాత్కాలిక వీసాల జారీలో భారతీయులు అధికంగా ఉండటం గమనార్హం. ఈ మార్పుల వల్ల భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో మేలు జరగనుంది.

