ఉద్యోగాల కోసం బ్రిటన్ వెళ్లే భారతీయులకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. జులై 22 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీని ద్వారా వలసలను తగ్గించి, బ్రిటన్ పౌరులకు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగాలకు వీసా నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఈ నిర్ణయం చాలా మంది భారతీయులపై ప్రభావం చూపనుంది.

