loader

పశ్చిమాసియాలో యుద్ధం.. ఐరాస అత్యవసర సమావేశం..!

పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ.. ఐరాసలోని 15 మందితో కూడిన బృందం సాయంత్రం నాలుగు గంటలకు న్యూయార్క్‌లో అత్యవసరంగా భేటీ అవ్వనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 2 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ఇరాన్‌పై ఇజ్రాయేల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన సైనిక దాడులను ఖండిస్తూ.. రష్యా, చైనా, ఫ్రాన్స్, బహ్రెయిన్, కొలంబియా దేశాలు ఐరాస అత్యవసర భేటీని కోరాయి. ఈ సమావేశానికి బ్రిటన్ అధ్యక్షత వహించనుంది.

అభుదాబిలో చిక్కుకున్న తెలుగువాళ్లు

అభుదాబిలో పలువురు తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. అమెరికా నుంచి బయలుదేరి అభుదాబిలో ఇతిహాద్ విమానం ఆగింది. ఈరోజు(శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి రాత్రికి ఈ విమానం శంషాబాద్ చేరుకోవాల్సి ఉంది. ఎయిర్ బేస్‌పై మరిన్ని దాడులు జరుగవచ్చోమోనని అభుదాబిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో అబుదాబి గగనతలాన్ని అక్కడి ప్రభుత్వం మూసివేసింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో తెలుగువాళ్లు చిక్కుకుపోయారు.

ఇరాన్ లీడర్ ఖమేనీ నివాసంపై దాడి..

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ నివాసాన్ని టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులకు దిగాయి. అయితే ఖమేనీ అంతకు ముందే సురక్షితంగా తప్పించుకున్నట్టు సమాచారం. టెహ్రాన్‌లోని ఖమేనీ ఇంటి దగ్గర జరిగిన భారీ నష్టాన్ని తాజాగా విడుదలైన ఉపగ్రహ చిత్రం స్పష్టంగా చూపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ లక్ష్యంగానే దాడులకు పాల్పడినట్టు ఇజ్రెయెల్ వెల్లడించింది

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఐఆర్‌జీసీ చీఫ్ మొహమ్మద్ పాక్పోర్ హతం

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్) చీఫ్ కమాండర్ మొహమ్మద్ పాక్పోర్ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. అయితే, అతడి మరణాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు. పాక్పోర్ ఇరాన్‌లో కీలక నేత. ఆయన ఐఆర్‌జీసీకి 260 రోజులుగా నాయకత్వం వహిస్తున్నాడు. అంతకుముందు అతడు మేజర్ జనరల్‌గా ఉండేవారు.

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

తాజాగా ఇరాన్‌లోని మినాబ్ నగరంలో జరిగిన ఒక ఘోర వైమానిక దాడి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఒక పాఠశాల లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ భయంకరమైన దాడిలో సుమారు 36 మంది విద్యార్థులు అక్కడికక్కడే మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.అంతర్జాతీయ సమాజం మరియు మానవ హక్కుల సంఘాలు ఈ ఘోర కలికలంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని కోరుతున్నాయి.

యుద్ధం మేం ముగిస్తాం.. ఇరాన్ సంచలన ప్రకటన…

అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్‌ స్పందించింది.. యుద్ధం మీరు ప్రారంభించారు.. మేం ముగిస్తాం..అంటూ పేర్కొంది. ఊహించని రీతిలో యుద్ధానికి ముగింపు ఉంటుందని ఇరాన్‌ ప్రకటించింది. అంతేకాకుండా.. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ కూడా ప్రతిదాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌అవీవ్‌పై మిస్సైల్‌ దాడులు చేసింది. ఇజ్రాయెల్‌పై 30 మిస్సైళ్లను ఇరాన్‌ ప్రయోగించినట్లు తెలుస్తోంది.ఇరాన్‌పై తమ బలగాలు కూడా దాడులు చేశాయని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికా దళాలు సైనిక చర్యను ప్రారంభించాయి.. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్‌ను అణుశక్తిగా మారనివ్వం.. అమెరికన్లను రక్షించడమే […]

ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులతో పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదిరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు, అప్రమత్తంగా ఉండాలని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, భారత పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నామని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

టెహ్రాన్‌ సహా అనేక ప్రాంతాలపై క్షిపణులతో దాడి!

ఇరాన్ రాజధాని టెహ్రాన్ కేంద్ర ప్రాంతంలో మూడు ప్రాంతాల్లో పెద్ద పేలుళ్లు వినిపించాయి. పేలుళ్ల తర్వాత భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని ఇరాన్ మీడియా తెలిపింది. టెహ్రాన్‌లోని రిపబ్లిక్ ప్రాంతంలో అనేక క్షిపణులు పడ్డాయని ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్‌లో లేరు. ఆయనను “సురక్షిత ప్రదేశానికి” తరలించినట్లు ఇరాన్ అధికారి ఒకరు రాయిటర్స్‌తో చెప్పారు. క్షిపణి దాడికి సిద్ధంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నట్లు సైన్యం తెలిపింది.

రియాద్‌లో రాజమండ్రి దంపతుల హత్య

గాలి రవి, శ్రీదేవి దంపతులు సౌదీ అరేబియా రియాద్‌లో హరా ప్రాంతంలో నివసిస్తున్నారు. కుమారుడు యెజ్ర ప్రభాకర్ స్థానిక భారతీయ పాఠశాలలో ప్లస్ 2 చదువుతున్నాడు. అయితే ప్రభాకర్ ఆన్‌లైన్ గేమ్‌లకు తీవ్రంగా బానిసయ్యాడు. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని  మందలించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రభాకర్, విచక్షణ కోల్పోయి తల్లిదండ్రులను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాడు. కొంతసేపటికి తాను నివసిస్తున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

మొదలైన యుద్ధం.. ఇరాన్ పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడులు

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి, డ్రోన్ దాడులు ప్రారంభించింది. ఇది అమెరికా-ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ అని తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో పౌరులంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ పిలుపునిచ్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON