ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ నివాసాన్ని టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులకు దిగాయి. అయితే ఖమేనీ అంతకు ముందే సురక్షితంగా తప్పించుకున్నట్టు సమాచారం. టెహ్రాన్‌లోని ఖమేనీ ఇంటి దగ్గర జరిగిన భారీ నష్టాన్ని తాజాగా విడుదలైన ఉపగ్రహ చిత్రం స్పష్టంగా చూపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ లక్ష్యంగానే దాడులకు పాల్పడినట్టు ఇజ్రెయెల్ వెల్లడించింది

