గాలి రవి, శ్రీదేవి దంపతులు సౌదీ అరేబియా రియాద్‌లో హరా ప్రాంతంలో నివసిస్తున్నారు. కుమారుడు యెజ్ర ప్రభాకర్ స్థానిక భారతీయ పాఠశాలలో ప్లస్ 2 చదువుతున్నాడు. అయితే ప్రభాకర్ ఆన్‌లైన్ గేమ్‌లకు తీవ్రంగా బానిసయ్యాడు. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని మందలించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రభాకర్, విచక్షణ కోల్పోయి తల్లిదండ్రులను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాడు. కొంతసేపటికి తాను నివసిస్తున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

