అభిమానుల అత్యుత్సాహం.. హీరో చొక్కా చింపేసిన ఘటన వైరల్
హైదరాబాద్‌లో ‘ది రాజా సాబ్’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిధి అగర్వాల్ చుట్టూ అభిమానులు గుమిగూడిన తీరు, ఉత్తరాదిలో ఇలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది. హిందీ సినిమా ఓటీటీ ప్రమోషన్లలో భాగంగా హీరో హర్షవర్ధన్ రాణే అభిమానుల చేతిలో చిక్కుకుని ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ‘ఏక్ దీవానే కి దీవానియత్’ సినిమా ప్రమోషన్ల సమయంలో అభిమానులు ఆయనను చుట్టుముట్టి చొక్కా కూడా చింపేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

