loader

ట్రంప్ మధ్యవర్తిత్వం.. శాంతివైపు రష్యా, ఉక్రెయిన్ మొగ్గు

రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నాల్లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పూర్తి సుముఖంగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. పామ్‌బీచ్ లోని ట్రంప్ నివాసమైన “ మార్ ఎ లాగో” లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం భేటీ అయ్యారు. యుద్ధం ముగింపు కోసం ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికపై ఈ చర్చలు సాగాయి.

తెలంగాణలో మరో ఎన్నికలకు ఈసీ రెడీ.. ఫిబ్రవరిలో మోగనున్న నగారా..!

తెలంగాణలో మరో స్ధానిక సంస్థల ఎన్నికల సమరానికి రంగం సిద్దమైంది. రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కొర్పొరేషన్లలో ఓటర్ల సవరణ జాబితా సిద్దం చేయాలని ఈసీ నిర్ణయించింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి ఓటర్ల లిస్ట్ సవరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది జనవరి 10లోపు పూర్తి చేయనుంది. దీని ఆధారంగా ఎన్నికలను నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి.

మరోసారి ఐపీఎస్‌ల బదిలీలు.. ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు..!

తెలంగాణలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. పోలీస్ కమిషనరేట్లను పునర్‌వ్యవస్థీకరించడంతో నలుగురు సీనియర్ ఐపీఎస్‌లకు స్థానం చలనం తప్పలేదు. ఇప్పటివరకూ రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న జి.సుధీర్ బాబు ‘ఫ్యూచర్ సిటీ’కి సీపీగా నియమితులయ్యారు, సైబరాబాద్ ఎస్పీగా కొనసాగుతున్న అవినాష్‌ మహంతి మల్కాజిగిరి సీపీగా బదిలీ అయ్యారు, ఎం.రమేశ్‌ సైబరాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆక్షాంన్షు యాదవ్.. యాదాద్రి ఎస్పీగా వెళ్లనున్నారు.

SIR జనం ఉసురు తీస్తోంది- ఇప్పటికే 50 మంది ప్రాణాలు కోల్పోయారు: సీఎం మమత

బంగాల్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియపై సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఆ ప్రక్రియ వల్ల చాలా మంది అనవసర వేధింపులకు గురవుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె ఆరోపించారు. ఎస్‌ఐఆర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 50 మందికిపైగా ఆత్మహత్య లేదా మానసిక ఆందోళనతో ప్రాణాలు కోల్పోయారని మమత వెల్లడించారు. ప్రజల ఉసురు తీసేలా ఉన్న ఎస్‌ఐఆర్‌ పక్షాన తాము నిలిచేది లేదన్నారు. దేశ పౌరసత్వానికి, ఓటు […]

పినాక రాకెట్ ప్రయోగం విజయవంతం.. సామర్థ్యం ఎంతంటే..?

దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక (Pinaka Rocket) నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. తొలి ప్రయత్నంలోనే ఈ రాకెట్‌ను డీఆర్‌డీవో (DRDO) విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్ కేంద్రమైన చాందీపూర్‌ నుంచి ఈ రాకెట్‌ను నింగిలోకి పంపారు. 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్ధ్యం దీని సొంతం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నుంచి అనుమతి వచ్చిన రోజే పినాకను ప్రయోగించారు.

‘ప్రియాంక Vs రాహుల్ గాంధీ – కాంగ్రెస్ రెండు శిబిరాలుగా చీలిపోయింది!’

కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోయిందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోపించింది. కాంగ్రెలో ఒకటి ప్రియాంక గాంధీ వాద్రా శిబిరం, మరొకటి ఆమె సోదరుడు రాహుల్ గాంధీ శిబిరమని పేర్కొంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్​లో రాహుల్ గాంధీ స్థానంలో వేరే వ్యక్తిని నియమించాలనే డిమాండ్ ఉందని విమర్శించింది. లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, విదేశీ గడ్డపై భారత్​ను అప్రతిష్టపాలు చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధికార […]

మదనపల్లెలోకి రాయచోటి, 28కి చేరనున్న జిల్లాల సంఖ్య

ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా… మూడు కొత్త జిల్లాలు మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరంల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని… కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లాలో విలీనం చేస్తారు. అంటే కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ… ఒక జిల్లాను తొలగించడంతో రాష్ట్రంలో జిల్లాల మొత్తం సంఖ్య 28కి పెరగనుంది. తుది గెజిట్ నోటిఫికేషన్ రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

సర్కార్ భూమికి ఎసరు పెట్టిన రెవెన్యూ అధికారులు

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైసబల్లి తహశీల్దార్, మరికొందరు అధికారుల నిర్వాకం వల్ల చింతగూడెం గ్రామంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఇతరులకు బదిలీ అయినట్లు సమాచారం. ఈ ఘటనలో, 30 గుంటల ప్రభుత్వ భూమిని తహశీల్దార్ డిజిటల్ సైన్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినట్లు స్థానిక గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో, ఆగ్రహించిన చింతగూడెం గ్రామస్తులు కల్లూరు సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఆ ఎస్‌ఐపై తిరగబడ్డ జనం..

ప్రకాశం జిల్లా పొదిలి ఎస్‌ఐ వేమన వ్యవహారశైలిపై జనం తిరగబడ్డారు. ఓ వ్యాపారస్థుడ్ని విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా బూతులు తిట్టారంటూ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌ పాటించారు. ఓ షాపు ముందు లారీ  రోడ్డుకు అడ్డంగా ఉందంటూ తొలుత లారీ డ్రైవర్‌పై చేయిచేసుకోవడమే కాకుండా షాపు యజమానులైన తండ్రీ కొడుకులను చితకబాది తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నించారంటూ ఆరోపించారు. బాధితులతో కలిసి ఆర్యవైశ్య సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం పోలీసుశాఖకు […]

ఉన్నావ్‌ అత్యాచారం కేసు.. బిజెపి మాజీ ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ

2017 ఉన్నావ్‌ అత్యాచారం కేసులో బిజెపి మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సెంగార్‌కు విధించిన జీవిత ఖైదును నిలిపివేసి, బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై విచారించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, జస్టిస్‌లు జె.కె. మహేశ్వరి, అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన వెకేషన్ బెంచ్.. ఈ విషయంపై పరిశీలన అవసరమని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సెంగార్‌ను కస్టడీ నుండి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON