దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక (Pinaka Rocket) నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. తొలి ప్రయత్నంలోనే ఈ రాకెట్‌ను డీఆర్డీవో (DRDO) విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్ కేంద్రమైన చాందీపూర్ నుంచి ఈ రాకెట్‌ను నింగిలోకి పంపారు. 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్ధ్యం దీని సొంతం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నుంచి అనుమతి వచ్చిన రోజే పినాకను ప్రయోగించారు.

