తన స్టైల్, నటనతోనే కాకుండా క్రమశిక్షణతోనూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు అజిత్ కుమార్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (ఏప్రిల్ 23) నేపథ్యంలో ఆయన విదేశాల నుండి స్వదేశానికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం అజిత్ తన తదుపరి చిత్రాల షూటింగ్స్ మరియు అంతర్జాతీయ రేసింగ్ పోటీల నిమిత్తం బెల్జియంలో ఉన్నారు.

