కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోయిందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోపించింది. కాంగ్రెలో ఒకటి ప్రియాంక గాంధీ వాద్రా శిబిరం, మరొకటి ఆమె సోదరుడు రాహుల్ గాంధీ శిబిరమని పేర్కొంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ స్థానంలో వేరే వ్యక్తిని నియమించాలనే డిమాండ్ ఉందని విమర్శించింది. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, విదేశీ గడ్డపై భారత్‌ను అప్రతిష్టపాలు చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు.

