హీరోయిన్ల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. వ్యక్తిగతంగా మహిళా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని శివాజీకి ఆదేశాలు జారీ అయ్యాయి. శనివారం శివాజీ సికింద్రాబాద్లోని బుద్ధ భవన్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన కమిషన్ ఎదుట హాజరై, తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

