మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈకేసులో నిందితుడు ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు. హీరోయిన్ సోదరుడి కోసం ఈగల్ టీం, మాసబ్ ట్యాంక్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్విల అరెస్టుతో నటి సోదరుడు పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులకు నలుగురు రెగ్యులర్ కస్టమర్లు సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు

