జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవతార్’, 2009లో ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది. 2022లో ‘అవతార్ 2’ మూవీ వచ్చినా ఆదరించిన అభిమానులు, ‘అవతార్ 3’ మూవీని మాత్రం తిరస్కరించారు.. డిసెంబర్ 5న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ‘అవతార్ 3’ మూవీ, బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రిజల్ట్ రాబట్టలేకపోయింది. దీంతో ‘అవతార్’ సిరీస్లో భాగంగా రావాల్సిన ‘అవతార్ 4’, ‘అవతార్ 5’ సినిమాలను నిలిపివేయాలని డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ఎంటర్టైన్మెంట్ వీక్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

