loader

ఎస్. జానకి కుటుంబంలో విషాదం.. ఆమె కుమారుడు కన్నుమూత

ప్రముఖ గాయని ఎస్‌.జానకి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) ఈరోజు ఉదయం కన్నుమూశారు. మురళీకృష్ణ మరణం తనను షాక్‌కు గురించేసిందని సింగర్‌ చిత్ర ఫేస్‌బుక్‌ వేదికగా విచారం వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆయన తెలుగు, మలయాళ సినిమాల్లో నటించారు. ‘వినాయకుడు’, ‘మల్లెపువ్వు’ వంటి చిత్రాల్లో కనిపించారు. ‘కూలింగ్‌ గ్లాస్‌’ అనే మలయాళ సినిమాకు రచయితగానూ వర్క్‌ చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు […]

ఇది ప్రారంభం మాత్రమే.. మేనకోడలిపై మెగాస్టార్ ప్రశంసలు

మెగాస్టార్ చిరంజీవి తన మేనకోడలిపై ప్రశంసలు కురిపించారు. మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలోని పాటపాడిన తన మేనకోడలు నైరాను కొనియాడారు. నా చిన్న మేనకోడలు నైరా ఫ్లై.. హై పాట పాడటం చూసి.. నా హృదయం ఆనందంతో నిండిపోయిందని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. నీ మార్గంలో నువ్వు మరింత అంతులేని అవకాశాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నట్లు తన ట్వీట్లో రాసుకొచ్చారు.

తారక్‌కు స్వల్ప అస్వస్థత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు ఓ చిన్న బ్రేక్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. దానికి సంబంధించిన షూటింగ్ వరుసగా జరిగింది. ఈ చిత్రీకరణ సమయంలోనే ఎన్టీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వరుసగా షూటింగ్‌లో పాలుపంచుకోవడం వల్ల, వాతావరణం సరిగా లేక ఎన్టీఆర్ కు అనారోగ్యం వాటిల్లిందని యూనిట్ […]

రాచెల్ మెక్‌ఆడమ్స్‌కు అరుదైన గౌరవం.. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు

హాలీవుడ్ వెండితెరపై తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి రాచెల్ మెక్‌ఆడమ్స్ అరుదైన గౌరవం ద‌క్కించుకుంది. సినీ రంగంలో ఆమె అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ప్రఖ్యాత ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్’ (Hollywood Walk of Fame)లో 2,833వ నక్షత్రాన్ని(Star) ఆమెకు కేటాయించి ఘనంగా గౌరవించారు. లాస్ ఏంజిల్స్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో రాచెల్ మెక్‌ఆడమ్స్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని సందడి చేశారు.

సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్..

గత ఆదేశాలను ధిక్కరిస్తూ మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి ధరలు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్-1955 ప్రకారమే ధరల నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపై ఏ సినిమాకైనా టికెట్ ధరల పెంపు నిర్ణయం తీసుకునేటప్పుడు 90 రోజుల ముందే ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా మళ్లీ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

మీకసలు బుద్దుందా..?.. వీధి శునకాల ఘటనపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..

టాలీవుడ్ నటి రేణు దేశాయ్ వీధి శునకాల వరుస ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక కుక్కకు ఏమైన జరిగితే కొరికితే వెంటనే దగ్గరలోని అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కానీ వందల సంఖ్యలో నోరులేని కుక్కల్ని చంపడం ఏంటని ఎమోషనల్ అయ్యారు. ఇక మహిళలపై, అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు మొదలైనవి జరుగుతున్నాయని వీటినిఎవరు ప్రశ్నించడంలేదని, ఒక్క నోరులేనీ జీవాలు మాత్రమే మీకు కన్పిస్తున్నాయా అంటూ రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు. కుక్కల్ని చంపి మీకు అసలు నిద్ర […]

ఏఆర్ రెహ్మాన్‌కు మ‌ద్ద‌తు ప‌లికిన ఇద్ద‌రు కూతుళ్లు

ఏఆర్ రెహ్మాన్ వ్యాఖ్య‌ల తీవ్ర దుమారం నేప‌థ్యంలో రెహ్మాన్ ఇద్దరు కూతుళ్లు స్పందించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ రెహ్మాన్‌కు వాళ్లు మ‌ద్ద‌తు ప‌లికారు. త‌మ తండ్రితో మీరు విబేధించ‌వ‌చ్చు అని, కానీ ఆయ‌న త‌న అనుభ‌వాన్ని వ్య‌క్తం చేసే స్వేచ్ఛ‌ను హ‌రించ‌లేర‌ని వాళ్లు పేర్కొన్నారు. ఏఆర్ రెహ్మాన్ కూతుళ్లు ఖ‌టిజా, ర‌హీమా.. త‌మ ఇన్‌స్టా స్టోరీల్లో ఆ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. మ‌ల‌యాళం మ్యూజిక్ కంపోజ‌ర్ కైలాశ్ మీన‌న్ రాసిన పోస్టును రెహ్మాన్ కూతుళ్లు రీ-పోస్టు చేశారు.

మాస్ట్రో ఇళయరాజాకి మరో ప్రతిష్టాత్మక అవార్డు…

మాస్ట్రో ఇళయరాజాకి మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కనుంది. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకూ మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగే 11వ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (AIFF)లో ఇళయరాజాకి ప్రతిష్టాత్మక ‘పద్మపాణి’ అవార్డును బహుకరించబోతున్నారు. 2010లో ‘పద్మభూషణ్’ పురస్కారం దక్కించుకున్న ఇళయరాజా, 2018లో ‘పద్మ విభూషణ్’ పురస్కారం దక్కించుకున్నారు. ఐదు సార్లు నేషనల్ అవార్డు గెలిచిన ఇళయరాజా, మరో ఐదు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నారు.

‘కొరియన్ కనకరాజు’ వచ్చేసినాడమ్మీ…

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి కొరియన్ కనకరాజు అనే టైటిల్ ఖరారైంది. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌లో ఆయన కొరియన్ భాషలో “నేను తిరిగొచ్చేశా” అంటూ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ కామెడీ హారర్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేయగా, టైటిల్‌తో పాటు గ్లింప్స్ […]

మహేష్ బాబుతో సినిమా ఛాన్స్.. నేను గానీ నోరు విప్పితే సంచలనమే..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో కూడా తనకు అవకాశం వచ్చినట్టు వెల్లడించారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ సినిమాలో నటించే అవకాశం చేజారిపోయిందని, అయితే ఆ వ్యక్తిగత కారణాలు  బయటకు చెప్పలేదు. ఒకవేళ వాటిని బయటపెడితే అనవసరమైన వివాదాలకు దారితీసే అవకాశం ఉందని, అందుకే ఆ విషయాలను గోప్యంగా ఉంచుతున్నానని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON