loader

ముఖ్యమంత్రివా లేక ముఠా నాయకుడివా?: కెటిఆర్ ఫైర్

ముఖ్యమంత్రివా లేక ముఠా నాయకుడివా..? అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, అసాంఘిక చర్యలను, నేరాలను ప్రోత్సహించేలా మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండాపై ఉన్న చెక్కుచెదరని అభిమానాన్ని చూసి ముఖ్యమంత్రికి మైండ్ బ్లాక్ అయ్యిందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.

కోహ్లీ సెంచరీ కొట్టినా.. తొలిసారి న్యూజిలాండ్‌కు సిరీస్ కోల్పోయిన టీమిండియా..!

నిర్ణయాత్మక మూడో వన్డేల్లో విరాట్ కోహ్లీ(124) సెంచరీతో గర్జించినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఇండోర్‌లో 338 పరుగుల ఛేదనలో ఒంటరి సైనికుడిలా పోరాడిన విరాట్‌కు హర్షిత్ రానా(52) అండగా నిలిచాడు. కానీ, రానా ఔటయ్యాక వరుసగా రెండు ఫోర్లు బాదిన కోహ్లీ.. 46వ ఓవర్ నాలుగో బంతికి వెనుదిరిగాడు. చివరి బంతికి కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడంతో న్యూజిలాండ్ 41 రన్స్ తేడాతో గెలుపొందింది. భారత గడ్డపై ఆ జట్టుకు ఇదే మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్ […]

మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో రికార్డ్

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 54వ సెంచరీని సాధించాడు. ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. రన్ మేషిన్ కోహ్లీ 91 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 8 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

మూడేళ్లక్రితం అత్యాచారానికి గురైన కుకీ యువతి.. ఆస్పత్రిలో మృతి

మణిపూర్లో మూడేళ్లక్రితం చెలరేగిన హింస గురించి తెలిసిందే. ఈ హింసలో సామూహిక అత్యాచారానికి గురైన ఒక యువతి చికిత్స పొందుతూ గత ఆదివారం (జవనరి 11) మరణించింది. అప్పట్లో కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణల సందర్భంగా వందల మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు, దహనాలు జరిగాయి. దుండగులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. మెయితీ తెగకు చెందిన మహిళలు కూడా ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

ధ్రువ్ రాఠీ భార్యను మోసం చేశాడా..? వీడియో రిలీజ్

ధ్రువ్ రాఠీ.. యూట్యూబ్, సోషల్ మీడియాలో వివాదాస్పద అంశాలతో వీడియోలు చేస్తూ గుర్తింపు సంపాదించుకున్నాడు ఇప్పుడు ధ్రువ్ రాఠీపైనే సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం మొదలైంది. అది కూడా అతడి వ్యక్తిగత జీవితంపై. అతడు తన భార్య జూలీని మోసం చేశాడని పలు సోషల్ మీడియా అకౌంట్లలో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది తన ఇమేజ్ దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేస్తున్నారని ధ్రువ్ రాఠీ విమర్శించాడు. ఇలా ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారాలు చేయకుండా, […]

కరాచీలోని షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి, అంతకంతకూ పెరగుుతున్న మృతులు!

పాకిస్తాన్‌లోని కరాచీలోని ఒక షాపింగ్ మాల్‌లో శనివారం రాత్రి (జనవరి 17, 2026) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. వారిలో ఒక అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన జరిగి 12 గంటలకు పైగా గడిచినా, కొంతమంది ఇప్పటికీ భవనంలో చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు వారిని రక్షించడానికి అగ్నిమాపక శాఖ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడించారు.

150 మందికి పైగా పిల్లలను రక్షించిన మహిళా పోలీస్‌ అధికారిణి.. రైల్వే అత్యున్నత పురస్కారం

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్‌)కు చెందిన అధికారిణి 150 మందికిపైగా పిల్లలను రక్షించారు. ఈ నేపథ్యంలో ఆమె సేవలను రైల్వే మంత్రిత్వ శాఖ గుర్తించింది. రైల్వే అత్యున్నత పురస్కారంతో సత్కరించింది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చందనా సిన్హా 2024 నుంచి భారత రైల్వే ఆపరేషన్ ‘నాన్హే ఫరిష్టే’ (ఆపరేషన్ లిటిల్ ఏంజిల్స్)లో ఆమె భాగమయ్యారు. రైళ్లు, రైల్వే స్టేషన్‌ ప్రాంతాల్లో తప్పిపోయిన, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన 152 మంది పిల్లలను ఆమె రక్షించారు.

నోబెల్ ప్రైజ్ పై తేల్చేసిన కమిటీ..! ట్రంప్-మచాడో డ్రామాపై.!

వెనెజులా ప్రతిపక్ష నాయకురాలు మచాడో.. తనకు ఇచ్చిన ప్రైజ్ ను తీసుకెళ్లి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెప్పు కోసం ఆయనకు తిరిగి ప్రదానం చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. నార్వేకు చెందిన నోబెల్ అవార్డుల ఫౌండేషన్ స్పందించింది. ప్రతీ నోబెల్ బహుమతిని ప్రదానం చేసే హక్కు ఎవరికి ఉందో అది నిర్దేశిస్తుందని ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. అందువల్ల ఒక బహుమతిని, ఊహకు కూడా మరెవరికీ బదిలీ చేయలేము లేదా పునఃప్రదానం కూడా చేయలేమని తేల్చిచెప్పేసింది. తద్వారా […]

బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహారశైలి..: హరీష్‌ రావు

ఎన్టీఆర్ జన్మపర్యంతం ద్వేషించిన కాంగ్రెస్ లో చేరి, నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి. సీఎం పదవి అనుభవిస్తూనే, రేవంత్ మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్నటీడీపీపై బహిరంగంగా అభిమానం కురిపించడం వెనుక మతలబు ఏంటి..? కాంగ్రెస్ శత్రువులైన బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహారశైలి ఉంది. పగలు రాహుల్ గాంధీ జపం.. రాత్రి బీజేపీ, టీడీపీ దోస్తీ.. రేవంత్ రాజకీయ యాత్ర మొత్తం గురువు చంద్రబాబు కనుసన్నలలోనే సాగుతున్నది అని […]

ద్రోహ బుద్ధి అనేది రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉంది : హరీష్‌ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ముమ్మాటికీ రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర.. సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ‘ఓటుకు నోటు’ దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అని హరీష్‌ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON