నిర్ణయాత్మక మూడో వన్డేల్లో విరాట్ కోహ్లీ(124) సెంచరీతో గర్జించినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఇండోర్‌లో 338 పరుగుల ఛేదనలో ఒంటరి సైనికుడిలా పోరాడిన విరాట్‌కు హర్షిత్ రానా(52) అండగా నిలిచాడు. కానీ, రానా ఔటయ్యాక వరుసగా రెండు ఫోర్లు బాదిన కోహ్లీ.. 46వ ఓవర్ నాలుగో బంతికి వెనుదిరిగాడు. చివరి బంతికి కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడంతో న్యూజిలాండ్ 41 రన్స్ తేడాతో గెలుపొందింది. భారత గడ్డపై ఆ జట్టుకు ఇదే మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం కావడం విశేషం.

