తుపాకీతో కాల్చుకొని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో జరిగింది. ధనరాజు అనే కానిస్టేబుల్ కాకినాడ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నాడు. విధులు నిర్వహిస్తుండగా రైఫిల్‌తో కానిస్టేబుల్ కాల్చుకున్నాడు. తోటి సిబ్బంది అతడు తీవ్రంగా గాయపడడంతో కాకినాడ జిజిహెచ్కి తరలించారు. అతడి పరిస్థితి నిలకడగానే ఉందన్న వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

