సైబర్ మోసాల భారీ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేధించారు నిందితుల్లో 32 మంది బ్యాంకు అధికారులు, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు, సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కైన ఆయా బ్యాంకుల అధికారులు.. వారి కోసం అక్రమంగా బ్యాంకు అకౌంట్స్ తెరిచి.. వాటిని మ్యూల్ అకౌంట్స్‌గా వాడుతున్నట్లు దర్యాప్తులో తేల్చారు. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు ఏకంగా 350 బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు గుర్తించారు.
ఈ అకౌంట్స్‌కు దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉన్నట్లు బయటపడింది.

