జమ్మూకశ్మీర్‌లోని ఉధంపుర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి కొండపై నుంచి దొర్లుతూ కిందకు పడిపోయిన ఘటనలో 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ బస్సు ఓ మారుమూల గ్రామం నుంచి ఉధంపుర్‌కు వెళ్తుండగా.. కాగోర్ట్ గ్రామ సమీపంలోని కొండ మార్గంలో మలుపు దాటుతుండగా ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు.

