హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ మోసం వెలుగుచూసింది. నగరంలోని వివాదాస్పద భూములను అమ్ముతామని నమ్మించి, ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ సంస్థను రూ.14.85 కోట్లకు ముంచిన ఆరోపణలపై సంధ్యా కన్‌స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యలపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) కేసు నమోదు చేసింది. తమ డబ్బు తిరిగి ఇవ్వమని కోరినందుకు నిందితులు బెదిరింపులకు కూడా పాల్పడినట్లు సమాచారం. గతంలో కూడా శ్రీధర్ రావుపై పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

