ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ఇరాన్ విదేశాంగ విధానాన్ని శాసించే మితవాద నాయకులను పక్కకు నెట్టి, అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకునే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) పట్టు సాధించింది.
IRGC కమాండర్-ఇన్-చీఫ్ అహ్మద్ వాహిది, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మహ్మద్ బాఘర్ జోల్ఘాదర్ మరియు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ హుస్సేన్ తాబ్ కలిసి ఒక శక్తివంతమైన వర్గంగా ఏర్పడ్డారు. వీరు మితవాద విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రభావాన్ని తగ్గించి, నిర్ణయాధికారాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు.

