ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ముమ్మాటికీ రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర.. సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ‘ఓటుకు నోటు’ దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అని హరీష్ రావు అన్నారు.

