రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు చెందిన అధికారిణి 150 మందికిపైగా పిల్లలను రక్షించారు. ఈ నేపథ్యంలో ఆమె సేవలను రైల్వే మంత్రిత్వ శాఖ గుర్తించింది. రైల్వే అత్యున్నత పురస్కారంతో సత్కరించింది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చందనా సిన్హా 2024 నుంచి భారత రైల్వే ఆపరేషన్ ‘నాన్హే ఫరిష్టే’ (ఆపరేషన్ లిటిల్ ఏంజిల్స్)లో ఆమె భాగమయ్యారు. రైళ్లు, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో తప్పిపోయిన, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన 152 మంది పిల్లలను ఆమె రక్షించారు.

