ప్రముఖ గాయని ఎస్.జానకి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) ఈరోజు ఉదయం కన్నుమూశారు. మురళీకృష్ణ మరణం తనను షాక్‌కు గురించేసిందని సింగర్ చిత్ర ఫేస్‌బుక్ వేదికగా విచారం వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆయన తెలుగు, మలయాళ సినిమాల్లో నటించారు. ‘వినాయకుడు’, ‘మల్లెపువ్వు’ వంటి చిత్రాల్లో కనిపించారు. ‘కూలింగ్ గ్లాస్’ అనే మలయాళ సినిమాకు రచయితగానూ వర్క్ చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

