టాలీవుడ్ నటి రేణు దేశాయ్ వీధి శునకాల వరుస ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక కుక్కకు ఏమైన జరిగితే కొరికితే వెంటనే దగ్గరలోని అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కానీ వందల సంఖ్యలో నోరులేని కుక్కల్ని చంపడం ఏంటని ఎమోషనల్ అయ్యారు. ఇక మహిళలపై, అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు మొదలైనవి జరుగుతున్నాయని వీటినిఎవరు ప్రశ్నించడంలేదని, ఒక్క నోరులేనీ జీవాలు మాత్రమే మీకు కన్పిస్తున్నాయా అంటూ రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు. కుక్కల్ని చంపి మీకు అసలు నిద్ర ఎలా పడుతుందని భావోద్వేగంకు గురయ్యారు

