మాస్ట్రో ఇళయరాజాకి మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కనుంది. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకూ మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగే 11వ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (AIFF)లో ఇళయరాజాకి ప్రతిష్టాత్మక ‘పద్మపాణి’ అవార్డును బహుకరించబోతున్నారు. 2010లో ‘పద్మభూషణ్’ పురస్కారం దక్కించుకున్న ఇళయరాజా, 2018లో ‘పద్మ విభూషణ్’ పురస్కారం దక్కించుకున్నారు. ఐదు సార్లు నేషనల్ అవార్డు గెలిచిన ఇళయరాజా, మరో ఐదు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నారు.

