మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి కొరియన్ కనకరాజు అనే టైటిల్ ఖరారైంది. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌లో ఆయన కొరియన్ భాషలో “నేను తిరిగొచ్చేశా” అంటూ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ కామెడీ హారర్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేయగా, టైటిల్‌తో పాటు గ్లింప్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

